రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా సాగుతోంది. ఇప్పటికే ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో మంచు విష్ణు. శంషాబాద్ మండలం జల్లపల్లిలోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక గొప్ప కార్యక్రమం అనీ మానవాళికి మంచి చేసే ఈ కార్యక్రమంలో తననీ భాగస్వామ్యం చేసినందుకు దర్శకుడు శ్రీను వైట్లకి, ఎంపీ సంతోష్‌కి కృతజ్ఞతలు తెలిపారు.


ఆ స్టార్ హీరోతో కలిసి నటించడం సౌకర్యంగా ఉంటుంది : శ్రియ