telugu navyamedia
సినిమా వార్తలు

‘మా’కు ప్రకాశ్ రాజ్ రాజీనామా.. విష్ణు క్లారిటీ…

ఎంతో ఉత్కంఠ నడుమ సాగిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్ష ఎన్నికలు నిన్న‌టి (ఆదివారం)తో ముగిసింది. హోరా హోరీగా సాగిన ఎన్నికల పోరులో చివరికి మంచు విష్ణు ప్యానెల్‌ గెలుపొందింది. ఎన్నో ఆశ‌ల‌తో ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ ప‌డిన‌ ప్ర‌కాశ్ రాజ్ ఓటిమి పాలైయ్యారు. దీంతో ఈ రోజు ఉద‌యం మీడియా స‌మావేశంలో ఆవేద‌న‌తో తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

Prakash Raj submits his resignation for MAA

ఇక్కడ ప్రాంతీయ వాదానికి ప్రాధాన్యత ఇస్తున్నార‌ని, ఇలాంటి అసోసియేషన్‌లో తాను ఉండలేనంటూ మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తెలుగు సినిమాల్లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తానని, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతిథిగానే మెదులుకుంటానని తేల్చి చెప్పాడు.ఇది బాధతో చేస్తున్న రాజీనామా కాదని, ‘అతిథిగా వచ్చాను.. అతిథిగా ఉండాలి’ అనే ఉద్దేశంతో చేస్తున్నానని అన్నారు.

ఈ మేరకు ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణుకు అభినందనలు తెలుపుతూ సందేశం పంపారు. దీనిపై మంచు విష్ణు రిప్లై ఇచ్చి, ఆ స్క్రీన్‌షాట్‌ను అభిమానులతో పంచుకున్నారు.

విష్ణు, ప్రకాశ్‌ రాజ్‌లకు మధ్య ఫోన్‌లో జరిగిన చాట్‌ను స్క్రీన్‌ షాట్ ..
“డియర్‌ విష్ణు, ‘మా’ ఎన్నికల్లో నీవు సాధించిన అద్భుత విజయానికి అభినందనలు అని, ‘మా’ను నడిపించేందుకు అవసరమైన శక్తినంత పొందాలని కోరుకుంటున్నాఅని ప్ర‌కాశ్‌రాజ్‌ ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా… దయచేసి నా నిర్ణయాన్ని ఆమోదించండి. నాన్‌ మెంబర్‌గా నీకు అన్ని విధాలా సాయం చేస్తా.. థ్యాంక్యూ ప్రకాశ్‌రాజ్‌” అని మెస్సేజ్‌ పంపగా, అందుకు విష్ణు సమాధానం ఇచ్చారు.

Prakash Raj texts Manchu Vishnu that he's leaving MAA, Vishnu asks him to reconsider | The News Minute

“మీరు తీసుకున్న నిర్ణయం పట్ల నేను సంతోషంగా లేను. మీరు నాకంటే పెద్ద వారు.. జీవితంలో గెలుపోటములనేవి ఒకే నాణేనికి రెండు వైపులా ఉంటాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. మీరు భావోద్వేగానికి లోనుకావొద్దు. మా కుటుంబలో మీరూ భాగమే. కలిసి పనిచేయడానికి మీ ఆలోచనలకు మాకు అవసరం. మీరు ఇప్పుడు నాకు సమాధానం ఇవ్వొద్దు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా. అన్ని విషయాలపై చర్చించుకుందాం. లవ్‌ యు అంకుల్‌. దయచేసి తొందరపడొద్దు” అని విష్ణు అన్నారు .

Related posts