telugu navyamedia
సినిమా వార్తలు

నటి హేమ ఇంకా బ్ర‌తికుందంటే అన్నయ్య‌ పెట్టిన‌ బిక్షే.!

సీనియర్ నటి హేమ ఇంకా ప్రాణాలతో బ్రతికుందంటే చిరంజీవి చేసిన సహాయమే కారణమని న‌టుడు రాజారవీంద్ర వెల్ల‌డించారు. ర‌వీంద్ర తాజాగా నటించిన క్రేజీ అంకుల్స్ చిత్రం విడుదలవ్వగా… ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మెగాస్టార్ గొప్పతనం గురించి ఎవ్వరికి తెలియని విషయాలు వెల్లడించారు.

Crazy Uncles Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos | eTimes

సామాన్య జనాలకు, అభిమానులకే కాకుండా ఇండస్ట్రీ వ్యక్తులకి కూడా చిరంజీవి చేసే సహాయం గురించి విని అందరు షాక్ అవుతున్నారు. ఎవ్వరు ఎన్ని విమర్శించినా సేవ కార్యక్రమాల్లో మెగాస్టార్ చిరంజీవిని మించినోళ్లు టాలీవుడ్ లో ఉండరని చెప్పారు.

హేమ డెలివరీ సమయంలో మెగాస్టార్ చేసిన సాయం గుంరించి చెప్పి చిరంజీవిపై అభిమానం ఇంకాస్త ఎక్కువయ్యేలా చేశాడు.నటి హేమ డెలివరీ సమయంలో అత్యవసరంగా రక్తం అవసరమొచ్చింది. ఆమెది ఓ నెగెటివ్. ఆ బ్లడ్ గ్రూప్ చాలా రేర్‌గా ఉంటుంది. ఎన్ని చోట్ల ప్రయత్నించినా సమయానికి ఎక్కడ దొరకలేదు.

ఇంకాస్త ఆలస్యమవుతే ప్రాణాలకే ప్రమాదమయ్యే పరిస్థితితుల్లో అన్నయ్యే సహాయం చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వల్లే ఆమె బతికింది. ఆరోజు బ్లడ్ దొరికింది కాబట్టే ఆమె బతికింది. లేకపోతే చనిపోయేది. అలా రక్తం విలువ అవసరంలో ఉన్న వారికే తెలుస్తుంది. బ్లడ్ బ్యాంక్ నడపడం అంత సులేవీమీ కాదు. దానికి నెలకు కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది’ అని రాజా రవీంద్ర మెగాస్టార్ చిరంజీవి గురించి ఎవ్వరికి తెలియని విషయాలు చెప్పారు.

Actress Hema In South Indian Traditional Pink Saree | Most beautiful indian actress, Girl number for friendship, Saree

కాగా ఇటీవ‌ల కరోనా సెకండ్ వేవ్‌ టైంలో ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాట్లు, సీసీసీ పెట్టి అందరికీ నిత్యావసర సరుకులు అందించారు. కరోనా వల్ల రక్తం ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ సమయంలోనూ ఆ సమయంలోనూ అన్నయ్యే దగ్గరుండి అన్నింటిని చూసుకున్నారని, అంతేకాదు వ్యాక్సినేష‌న్ బ‌య‌ట కొని అంద‌రికీ ద‌గ్గ‌ర ఉండి చూసుకున్నార‌ని చెప్పారు.

Chiranjeevi Konidela sets up oxygen banks in Telugu states to help with Covid-19 crisis | Telugu Movie News - Times of India

ఇటీవ‌ల హేమ మా అసోసియేషన్ డబ్బులు మొత్తం ఖర్చు చేస్తున్నారంటూ నరేష్ మీద ఆరోపణలు చేశారు. దీంతో జీవిత, నరేష్ ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి హేమ చేసిన వాఖ్య‌ల‌ను ఖండించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రతిష్టను మసకబారేలా చేస్తున్న వారిని ఉపేక్షించవద్దని కృష్ణంరాజుకు చిరు లేఖ రాశారు. ఈ క్రమంలోనే హేమకు క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీసులు జారీ చేయ‌డం జ‌రిగింది

 

Related posts