టాలీవుడ్ యంగ్ హీరో, స్టార్ ఫ్యామిలీ వారసుడు మంచు మనోజ్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. తన వదిన (మంచు విష్ణు) వెరోనిక ద్వారా పరిచయం అయిన ప్రణతీ రెడ్డిని 2015 మే 20న పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నాడు మనోజ్. గురువారం తన ట్విటర్ పేజ్‌లో ఓ ఎమోషనల్ మెసేజ్‌ను ట్వీట్ చేసిన మనోజ్, ప్రణతితో తన వైవాహిక జీవితం ముగిసిపోయిందని వెల్లడించాడు. “నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎంతో అందమైన మా వివాహ బంధం ముగిసింది. బరువెక్కిన హృదయంతో ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. కొన్ని విభేదాల కారణంగా మేము ఎంతో బాధను అనుభవించాం. ఎంతో ఆలోచించిన తరువాత విడివిడిగా ప్రయాణించటమే కరెక్ట్ అని నిర్ణయించుకున్నాం. ఒకరి మీద ఒకరం ఎంతో గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ సమయంలో మా ఈ నిర్ణయానికి మీద అందరి మద్ధతుగా నిలిచివారి కృతజ్ఞతలు. కొంతకాలంగా నా మనసు సరిగ్గా లేని కారణంగా నేను నటన మీద ఇతర పనుల మీద దృష్టి సారించలేకపోయాను. ఈ కల్లోల పరిస్థితులను నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యాన్స్ సపోర్ట్ కారణంగానే తట్టుకోగలిగాను. ఈ కష్టకాలంలో నా వెన్నంటి నిలిచి వారందరికీ నా కృతజ్ఞతలు. ఇక నుంచి నా చివరి శ్వాస వరకు సినిమాల్లోనే కొనసాగుతా” అంటూ భావోద్వేగ పోస్ట్‌ను ట్విటర్‌లో షేర్ చేశాడు మనోజ్.
wanted to share this with u guys since long… Finalllly Here i go 🙏🏻 #Destiny I guess … pic.twitter.com/G5UxygNTfB
— MM*🙏🏻❤️ (@HeroManoj1) 17 October 2019
చంద్రబాబు చచ్చిన విషసర్పం..