telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తోడు దొంగలు : భట్టి విక్రమార్క

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తోడు దొంగలు… ఈ రెండు పార్టీలు పరస్పరం దాడులు చేసుకుంటూ ఎన్నికల్లో లబ్ది పొందాలని చుస్తున్నాయి అని సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో 45 శాతం నిరుద్యోగం వెంటాడుతోంది.. ఏటా రెండు కోట్లా ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగాలు వచ్చేవి.. కానీ ప్రైవేటుకు ఇవ్వడం మూలాన ఎస్సి ఎస్టీ లకు ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉంది.. దేశంలో అలాఉంటె ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ తీరు మరోలా ఉంది అని తెలిపారు. పీఆర్సీ కమిషన్ కూడా చెప్పింది లక్ష 90వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. కానీ కేటీఆర్ తప్పుడు లెక్కలు చెప్తూ మభ్యపెడుతున్నారు. దేశంలో బీజేపీ, తెలంగాణ లో టీఆర్ఎస్ లకు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి అని అన్నారు. భవిష్యత్తు లో.మనకు చాలా ఇబ్బందులు పడే అవకాశముంది. తెలంగాణ లో నిరుద్యోగం 35 శాతం ఉంది. నిరుద్యోగ భృతి ఇస్తామని గత ఎన్నికల్లో కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పటికి దిక్కులేదు అని ఆయన తెలిపారు. చూడాలి మరి దీని పై బీజేపీ, తెరాస నేతలు ఎలా స్పందిస్తారు అనేది.

Related posts