తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కారణంగా పాఠశాలలు సుదీర్ఘమైన మూసివేత అనంతరం సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు ప్రారంభించుటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే.
దీనిపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. స్కూల్స్ రీ – ఓపెన్ పై తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలకు అనుగుణంగా పాఠశాలలు రీ ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకుంది సర్కార్.
అయితే పాఠశాల పున:ప్రారంభంపై హైకోర్టులో వేసిన పిటిషన్ పై నేడు విచారించిన గౌరవ హైకోర్టు తన తీర్పును వెల్లడిస్తూ అన్ని విద్యాసంస్థలు తరగతి గదులు ప్రత్యక్ష బోధన తో పాటు ఆన్లైన్ తరగతులు కూడా నిర్వహించాలని పేర్కొన్నది.
హాస్టల్ నిర్వహణ సంబంధించి అక్టోబర్ నాలుగో తేదీ నాటికి విచారణను వాయిదా వేస్తూ అప్పటివరకు హాస్టళ్లు నిర్వహించరాదని పేర్కొన్నది. ప్రత్యక్ష లేదా ఆన్ లైన్ తరగతుల నిర్వహణ నిర్ణయాన్ని విద్యాసంస్థలకు వదిలి పెడుతూ తరగతులు నిర్వహించడానికి అనుమతి ఇస్తూ,విద్యాసంస్థలు ప్రత్యక్ష తరగతులకు హాజరు కావాలని విద్యార్థులపై ఒత్తిడి చేయరాదని సూచించింది.
ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలు విధిగా తప్పనిసరిగా కోవిడ్ నియమ నిబంధనలను పాటించాలని గౌరవ హైకోర్టు సూచించింది . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల లోగా విద్యాసంస్థలు అనుసరించాల్సిన కోవిడ్ నియమ నిబంధనలను ( SOP ) రూపొందించి విధిగా ఆచరించే విధంగా ఆదేశాలు జారీచేయాలని విద్యాశాఖ సూచించింది మరియు ప్రత్యక్ష తరగతులు నిర్వహించని పాఠశాలలపై విద్యాశాఖ ఎటువంటి చర్యలు తీసుకొనరాదని పేర్కొన్నది.
విద్యార్థులకు జరుగుతున్న విద్యా నష్టాన్ని ,తల్లిదండ్రుల ఆవేదనను, విద్యార్థుల యొక్క మానసిక స్థితిగతులను గుర్తించిన మన రాష్ట్ర ప్రభుత్వం వారు విద్యా శాఖ మరియు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపి పాఠశాల పున:ప్రారంభానికి అనుమతులు జారీ చేశాయని సెప్టెంబరు 1 వ తేది 2021 నాటి నుండి ప్రత్యక్ష తరగతులు నిర్వహించుకోవచ్చని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు పత్రికాముఖంగా తెలంగాణలోని అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలకు తెలియపరిచారు.
మరియు ఈ పత్రికా ప్రకటన సంయుక్తంగా రాష్ట్రా ప్రతినిదులు చర్చించి ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ కోశాధికారి ఐ వి రమణ రావు ల తో పాటు రాష్ట్ర రాష్ట్రకార్యవర్గ సభ్యులు,తెలుపుచున్నారు
కొత్త రాజధానుల జపం చేయడం మంచిదికాదు: వీహెచ్