telugu navyamedia
వార్తలు

కరోనా నుంచి కోలుకున్నాక బాధిస్తున్న ల‌క్ష‌ణాలు ..

కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కూడా 50% మంది రోగులు ఖచ్చితంగా దీర్ఘకాలికంగా వైరస్ లక్షణాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ లక్షణాలు శ్వాసలోపం అదేవిధంగా అలసట ఆసుపత్రిలో చేరిన తర్వాత కోలుకున్న రోగులలో ఈ లక్షణాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. కోమోర్బిడిటీల్లోనే ఎక్కువగా ప్రమాదం ఉంటోంది. సెకండ్ వేవ్ కొవిడ్ లక్షణాల తీవ్రత కారణంగా కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.

Corona Positive Cases: Telangana Reports 5,567 New COVID-19 Positive Cases  And 23 Deaths: తెలంగాణలో కరోనా కల్లోలం, కోవిడ్19 బారిన పడి తాజాగా 23 మంది  మృతి | తెలంగాణ News in Telugu

ఈ అంశాలపై చైనా నేషనల్ సెంటర్ ఫర్ రెస్పిరేటరీ మెడిసిన్ పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వచ్చిన తర్వాత ఆసుపత్రిలో చేరిన రోగులు ఎప్పుడూ కరోనా పొందని వారి కంటే తక్కువ ఆరోగ్యంగా ఉన్నారు. కొంతమంది రోగులు పూర్తిగా కోలుకోవడానికి ఒక సంవత్సరం వరకు పట్టవచ్చని చెబుతున్నారు.

కరోనా సెకండ్ వేవ్, ఇప్పుడు డెల్టా వేరియంట్ వ్యాప్తితో కరోనా నుంచి కోలుకున్నప్పటికీ వైరస్ ప్రభావ లక్షణాలు మాత్రం దీర్ఘకాలికంగా వేదిస్తూనే ఉంటాయి అంటున్నారు. వైరస్ కారణంగా శరీరంలో యాంటీబాడీలు తయారైనప్పటికీ అలసట మాత్రం అలానే ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ కూడా సైకోటోన్లను జనరేట్ చేస్తుంది. తద్వారా శరీరంలో అలసట వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

Coronavirus Incubation Period: How Long Before Symptoms Appear?

గొంతులో మంట..

కరోనాతో పోరాడే వారిలో ఎక్కువగా కనిపించే లక్షణం గొంతులో మంట.. వాయిస్ మారిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కరోనా నుంచి కోలుకున్నవారిలో ఎగువ శ్వాస సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో గొంతులో మార్పు ఎక్కువగా కనిపిస్తుంటుంది. నిరంతర దగ్గు, గొంతులో మంటగా అనిపించడం వంటి సమస్యలు ఉంటాయి.

Corona Alert: కరోనాను జయించారా..ఆ సమస్యలు పొంచి ఉన్నాయి జాగ్రత్త | హెల్త్  News in Telugu

పురుషులు కంటే మహిళలలో ఎక్కువ‌గా క‌నిపిస్తుంద‌ట‌..
కాగా..ఈ నివేదిక ప్రకారం, అలసట.. కండరాల బలహీనత కేసులు పురుషుల కంటే మహిళల్లో 1.4 రెట్లు ఎక్కువగా నమోదయ్యాయి. 12 నెలల ఇన్ఫెక్షన్ తర్వాత, ఊపిరితిత్తుల వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చికిత్స, అలసట, కండరాల బలహీనత సమయంలో స్టెరాయిడ్‌లు ఇచ్చిన కరోనా రోగులకు 1.5 రెట్లు ఎక్కువ కనిపించిందంట‌.

ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..
ఈ లక్షణాలు కనిపిస్తున్న వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. వీరు పోశాకాహారంపై దృష్టి పెట్టాలి. అదేవిధంగా అనారోగ్యాన్ని కలిగించే ఫుడ్ కు దూరంగా ఉండాలి. శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ధూమపానం వంటి అలవాట్లను విడిచిపెట్టాలి. ఎక్కువ చలి ప్రాంతాల్లో వీరు తిరగడం మంచిది కాదు. అలాగే..చల్లని పదార్ధాలకు దూరంగా ఉండాలి. ఇక అలసటకు గురి అవుతున్న వారు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.

Boost your immune system to fight the spread of coronavirus - The Statesman

చిన్న చిన్న వ్యాయామాలు చేయడం మంచిది. నిరంతరం పని చేయకుండా.. పని మధ్యలో చిన్న విరామం తీసుకోవడం ద్వారా ఈ అలసటను నివారించవచ్చు. రాత్రిపూట నాణ్యమైన నిద్ర మీ రోజువారీ ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తి , మానసిక స్థితిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఆకుపచ్చ ఆకు కూరలు, కొవ్వు చేపలు మీ మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది హృదయ సంబంధ రుగ్మతల నుండి రక్షిస్తుంది.

Related posts