telugu navyamedia
రాజకీయ వార్తలు

మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భారీ ఎన్‌కౌంటర్, మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భారీ ఎన్‌కౌంటర్.

ఈ ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టు అగ్రనేతలు మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందారు.

మారేడుమిల్లి సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్ర నాయకులు సమావేశమయ్యారని, అక్కడ షెల్టర్ తీసుకున్నారని పోలీసులకు విశ్వసనీయ వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది.

దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకుని కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి.

ఈ క్రమంలో బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో, పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు.

ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నందున మృతుల సంఖ్య, వారి వివరాలపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

 

Related posts