రౌడీ హీరో విజయ్ దేవరకొండ ,అనన్య పాండే హీరో హీరోయిన్లుగా నటించిన పాన్ ఇండియా చిత్రం లైగర్. పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఓ రేంజ్‌లో మార్మోగుతున్నాయి. మరోవైపు చిత్రయూనిట్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దేశాన్ని చుట్టొస్తోంది.
విజయ్, అనన్య పాండే ఇప్పటికే పలు నగరాలను సందర్శించగా ఇంకా మరికొన్ని సిటీలను పలకరించాల్సి ఉంది. దేశాన్ని చుట్టొస్తున్న కొడుకు సురక్షితంగా సేఫ్ గా ఉండాలంటూ విజయ్ తల్లి ఇంట్లో స్పెషల్ పూజలు నిర్వహించారు.
ఈ విషయాన్ని విజయ్ స్వయంగా ట్విటర్‌లో వెల్లడించాడు. ‘దాదాపు ఈ నెలంతా ఇండియాను చుట్టాల్సి ఉంది. ఇప్పటికే మేము ఎన్నో నగరాలు తిరిగాం, ఎంతో ప్రేమను పొందాం.. కానీ అమ్మ మాకు రక్షణ అవసరమని భావించింది. కాబట్టి ఇంట్లో పూజ చేసి, మా అందరికీ తాయత్తులు కట్టింది.
ఇక మేము మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నంతసేపు ఆమె ప్రశాంతంగా నిద్రపోతుంది’ అంటూ పూజకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో విజయ్, అనన్య తాయత్తులు కట్టుకున్నట్లు తెలుస్తోంది.