విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఘటనపై కేంద్ర పర్యావరణ శాఖ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పరిశ్రమలో ఉత్పత్తుల ప్రారంభానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని అఫిడవిట్ లో పేర్కొంది.
రెండేళ్ల క్రితమే అనుమతి నిరాకరించామని వెల్లడించింది. దీనిపై స్పందించిన హైకోర్టు, మిగతా ప్రతివాదులు కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను కోర్ట్ రేపటికి వాయిదా వేసింది.


ఎమ్మెల్యే రసయయి మరోసారి సంచలన వ్యాఖ్యలు..