బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో” చిత్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా గురించి యంగ్ రెబల్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అభిమానులు సినిమా అప్డేట్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తుండడంతో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా “సాహో : చాఫ్టర్-1” అంటూ దుబాయ్ ఎపిసోడ్, ప్రభాస్ లుక్ కు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు “సాహో : చాఫ్టర్-2” అంటూ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయబోతున్నారు చిత్రబృందం. అయితే చాప్టర్ 2 లో ప్రభాస్ కంటే కీలకంగా హీరోయిన్ శ్రద్ధా కపూర్ ని చూపించబోతున్నారని తెలుస్తోంది. సినిమాలో శ్రద్ధా పాత్ర ఎలా ఉండబోతుందో ఈ టీజర్ లో చూపించనున్నారట. మార్చి 3న శ్రద్ధా పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
previous post
next post

