telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పవన్‌ కళ్యాణ్‌ పై లక్ష్మీ పార్వతి ఫైర్‌

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మరియు పోసాని కృష్ణ మురళి వివాదంపై తెలుగు, సంస్కృతి అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి స్పందించారు. పోసాని మురళి భార్యకు జరిగిన అవమానం చూశాక మాట్లాడకుండా వుండటం మానవత్వం కాదని పవన్‌ కళ్యాణ్‌ పై లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. మహిళల ఆత్మ గౌరవాన్ని కించ పరిచే స్థాయికి తెలుగుదేశాన్ని దిగజార్చిన హీనుడు చంద్రబాబు అని నిప్పులు చెరిగారు.

అతని రాజకీయాలకు వారసత్వాన్ని లోకేష్, పవన్ సాగిస్తున్నారని…. ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంటి స్త్రీలను అవమానపరిచిన అదే టీడీపీతో కలిసి పనిచేస్తూ విలువలకు తిలోదకాలు ఇచ్చారు. ఈ అరాచకాలు సహించలేనివి. ఎంతో ఉత్తమురాలు, ఏనాడు బయటకు రాని పోసాని భార్యను మీరు అవమానించడం అంటే మీరు ఏ స్థితికి దిగజారిపోయారో ఆలోచించుకోండి. ముగింపు తొందరలోనే ఉంది. భగవంతుడే మీకు బుద్ది చెప్తాడు’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Related posts