తెలంగాణ సర్కార్ అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ నేతలలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు నక్కలన్నీ కలిసి సంతాప సభ పెట్టినట్టుందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు జల దీక్షలు చేయడంలో ఏమైనా అర్థం ఉందా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ పాలన చూసి కాంగ్రెస్ నేతలు ఈర్ష్య పడుతున్నారని అన్నారు. ఆరేళ్లలో కేసీఆర్ ఏం చేశారో కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రైతులను రాబందుల్లా పీక్కుతిన్న చరిత్ర కాంగ్రెస్ నాయకులదని అన్నారు. ఎన్నో ఏళ్లు పాలించి కాంగ్రెస్ నేతలు చేసిందేముందని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. గోదావరి నీటితో చెరువులు కళకళలాడుతున్నాయని చెప్పారు