ఈ ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 లో అదరగొట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వివాహం చేసుకున్నాడు. చాలా కాలంగా తాను ప్రేమిస్తున్న తన ప్రేయసి నేహా ఖేదేకర్‌ను నిన్న చెన్నైలో తక్కువ మంది అతిథుల మధ్య వివాహం చేసుకున్నాడు. అయితే వీరు ఈ ఏడాది ఆరంభంలోనే వివాహం చేసుకోవాల్సి ఉంది. కానీ మొదట కరోనా తర్వాత ఐపీఎల్ కారణంగా ఇది వాయిదా పడింది. అయితే ఈ వివాహానికి సంబంధించిన వీడియోను కేకేఆర్ తమ అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ఐపీఎల్ 2020 లో రాణించిన వరుణ్ మొదట ఆసీస్ పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ ఐపీఎల్ చివర్లో అతనికి గాయం వరుణ్ ఆసీస్ పర్యటనకు దూరం అయ్యాడు. అయితే బీసీసీఐ అతని స్థానంలో సన్ రైజర్స్ పేసర్ టి నటరాజన్ ను ఈ పర్యటనకు ఎంపిక చేసింది. దాంతో వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్న నటరాజన్ మంచి పేరును సంపాదించుకున్నాడు. అలాగే అతను సోషల్ మీడియాలో వరుణ్ చక్రవర్తికి సంబంధించిన పెళ్లి ఫొటోకు లైక్ కొట్టాడు. అయితే మరి వరుణ భారత జట్టు తర్వాతి పర్యటన కైనా ఎంపిక అవుతాడా… లేదా అనేది చూడాలి.
previous post