శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది.
బ్యారేజీలోని మొత్తం 70 గేట్లను ఎత్తివేసి 73,227 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
మరోవైపు కాల్వల ద్వారా 13,477 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఈరోజు సాయంత్రం లేదా రాత్రికి లక్షన్నర క్యూసెక్కులు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గేట్లు ఎత్తే నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు.
దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కాల్వల ద్వారా విడుదలయ్యే వరద నీరు పూడికతో రోడ్లపైకి రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.