telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పేద ప్రజలపై భారం వేయం..ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులు తగ్గిస్తాం!

ktr telangana

తెలంగాణలో ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులు తగ్గిస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. పేద, మధ్య తరగతి ప్రజలపై భారం వేయమని, రిజిస్ట్రేషన్‌ చేసిన సమయంలో ఉన్న ధర మేరకే ఫీజులు తీసుకుంటామని కేటీఆర్‌ తెలిపారు.

ఎప్పుడో కొని, రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకున్న స్థలాలకు ఇప్పుడు రూ.లక్షల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ను చెల్లించాలనడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకొన్న స్థలాలకు ప్రస్తుత మార్కెట్‌ విలువ ఆధారంగా క్రమబద్ధీకరణ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related posts