మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చాడు. బాలకృష్ణ షూటింగులకు ఇతర దేశాలు, రాష్ట్రాలు తిరుగుతాడని… రాష్ట్రంలో పరిస్థితులు ఆయనకు తెలియవని ఎద్దేవా చేశారు. ఆయన చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప ఏమీ చేయలేడని.. బాలకృష్ణ ఆటలో అరటిపండు లాంటి వాడని చురకలు అంటించారు.
చంద్రబాబుకు పెద్దిరెడ్డి దెబ్బకు చిన్న మెదడు చితికిపోయిందని… ఆయనకు మైండ్ చెడిపోయిన విషయం అందరికి తెలుసని తెలిపారు. విశాఖ ఉక్కు విషయంలో మోదీని ప్రశ్నించలేక జగన్ పై విమర్శలు చేస్తున్నాడని… చంద్రబాబు ఒక శనిగ్రహం అని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని మండిపడ్డారు. ఎవరికన్నా శని వదలాలంటే చంద్రబాబుకు పూజలు చేయాలని… వాళ్ళ పార్టీ నేతలు తమ శని వదిలించుకోడానికే చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నారట అని ఎద్దేవా చేశారు కొడాలి నాని.
next post
బీజేపీకి పెరుగుతున్న ఆధరణను చూసి టీఆర్ఎస్ భయపడుతుంది: లక్ష్మణ్