విజయవాడలోని తన నివాసంలో టీడీపీ ఎంపీ కేశినేని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఏపీ రాజధానిపై నెలకొన్న గందరగోళం పై అమరావతి ప్రాంత రైతులు ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కేశినేని రైతుల ఆందోళనలో పాల్గొనకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఈమేరకు చర్యలు తీసుకున్నారు.
మరోవైపు, రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. రాజధానిని ఇక్కడే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధిని మాత్రమే వికేంద్రీకరించాలని వారు కోరుతున్నారు. రైతుల ఆందోళనకు విపక్షాలు మద్దతు పలుకుతున్నాయి.


కేసీఆర్ను గద్దె దింపే బాధ్యత తీసుకున్నాం: రాజగోపాల్రెడ్డి