గంజాయి పదార్థాన్ని చెప్పుల్లో పెట్టి తరలిస్తుండగా ఎయిర్ పోర్ట్ లో అధికారులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే దోహాకు చెందిన ఓ ప్రయాణికుడు కేరళలోని కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గంజాయితో పట్టుబడ్డాడు. నిషేదిత గంజాయి పదార్థాన్ని తీసుకొని వెళ్తుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. పట్టుబడ్డ 690 గ్రాముల పదార్థం విలువ రూ. 7 లక్షలుగా సమాచారం. చెప్పుల్లో ఉంచి తరలిస్తుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు అప్పగించారు.
previous post

