telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దంటూ కౌంటరు దాఖలు చేసిన పోలీసులు…

bhuma akhila priya

గత కొన్ని రోజులుగా తెలంగాణలో అఖిల ప్రియ కేసు హల్ చల్ చేస్తుంది. అయితే ఈరోజు అఖిల ప్రియ బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. అయితే… భూమా అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దంటూ కౌంటరు దాఖలు చేసారు పోలీసులు. పిటీషనర్ కు గతంలో నేర చరిత్ర ఉందని.. కుటుంబానికి ఫాక్షన్ చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. మాజీమంత్రి, డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తి అని… సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు కోర్టు ముందు పేర్కొన్నారు. నేరానికి సంబంధించిన అన్నీ ఆధారాలు ఉన్నాయని… పరారీలో ఉన్న నిందితంల కోసం దర్యాప్తు బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయన్నారు. ఈ కేసులో తప్పించుకోడానికి… మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశం ఉందని… కిడ్నాప్ కేసు నిందితులను దోపిడి దారులుగా పరిగణించాలని కోరారు పోలీసులు. అఖిల ప్రియ భర్త భార్గవ రామ్ నేరప్రవృర్తి కలిగిన వ్యక్తి అని… కీలక నిందితులు పరారీలో ఉన్నారు, వారిని అరెస్ట్ చేయాల్సి ఉందని కోర్టు ముందు విన్నవించారు పోలీసులు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులను విచారించాల్సి ఉందని.. ఎట్టి పరిస్థితిలో బెయిల్ ఇవ్వొద్దని కోరారు బోయినపల్లి పోలీసులు. అయితే… ఈ కేసుపై మరికాసేపట్లో బెయిల్ పై తీర్పు ఇవ్వనుంది సికింద్రాబాద్ కోర్టు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts