తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం తన స్వగ్రామమైన చింతమడకలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతమడక గ్రామం తనను కనిపెంచిందని, చింతమడక కోసం తాను ఎంత చేసినా తక్కువే అని అన్నారు. ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు లబ్ధి పొందే పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు కేసీఆర్ హామీ ఇచ్చారు. చింతమడకకు 2 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
కార్తీక మాసంలో చింతమడకలో గృహప్రవేశాలు జరగాలని అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో చింతమడక బంగారు తునక కావాలని ఆకాంక్షించారు. చింతమడక అభివృద్ది కోసం అదనంగా రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అదనపు నిధులు ఎమ్మెల్యే ద్వారా కలెక్టర్ పొందవచ్చు అని సూచించారు. గ్రాంలో అద్భుతమైన ఫంక్షన్ హాల్ నిర్మించాలని అలాగే ప్రతీ వీధిలోనూ సీసీరోడ్లు వేయించుకోవాలని స్పష్టం చేశారు. చింతమడక గ్రామాన్ని చూపి పక్క ఊర్లు నేర్చుకోవాలని అలాంటప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుందని తెలిపారు.


చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తిరగబడ్డారు: రోజా