telugu navyamedia
సినిమా వార్తలు

కార్తీ “దొంగ” : “రూపి రూపి” వీడియో సాంగ్

Donga

ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన యాంగ్రీ హీరో కార్తీ ఇప్పుడు “దొంగ”గా రానున్నాడు. ఈ చిత్రం లో కార్తీకి వదిన, సూర్య సతీమణి జ్యోతిక కీలక పాత్రలో నటిస్తున్నారు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దొంగ’ పోస్టర్స్, టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘దొంగ’ నుండి ఫస్ట్ వీడియో సింగిల్ ను తాజాగా విడుదల చేశారు. ‘రూపి రూపి’ అంటూ సాగే హుషారైన పాటని గోవాలో కలర్ఫుల్ గా పిక్చరైజ్ చేశారు. లాంగ్ హెయిర్ తో, కొత్త తరహా స్టైలింగ్ తో కార్తీ సాంగ్ లో ఎనర్జిటిక్ గా ఉన్నారు.”… ఎవ్వరినీ వదలదుగా నా స్ట్రీట్ స్మార్ట్ చిలిపి తనం.. మాయలోన పుట్టి మాయలోన పెరిగినాను” అంటూ సాగే ఈ పాట హీరో క్యారెక్టరైజేషన్ నీ తెలిపేలా సాగుతుంది. రామజోగయ్య శాస్త్రీ ఈ పాటని రాయగా, రంజిత్ గోవింద్ పాడారు. గోవింద్ వసంత సంగీతం అందించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి డిసెంబ‌ర్ 20 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు.

Related posts