telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

అల వైకుంఠ పురములో .. మరో సాంగ్ .. అదిరిపోయిందా ..

alavaikuntapuramlo song

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి మూవీ సూపర్ హిట్ అందుకున్నాయి. నాపేరు సూర్య ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న తర్వాత అల్లు అర్జున్ దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకున్నారు. మంచి కథల కోసం ఎదురు చూస్తున్న ఆయనకు త్రివిక్రమ్ మళ్లీ తోడయ్యాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ప్రస్తుతం ‘అల వైకుంఠ పురములో’ మూవీ రూపొందుతుంది. ఈ మూవీలో మరోసారి ఫాదర్ సెంటిమెంట్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అయితే తండ్రి కోసం తనయుడు ఏం చేశాడు అన్నదే ఈ మూవీ కాన్సెప్ట్ అని సమాచారం. ఈ మూవీ నుంచి ఇప్పటికే సామజవర గమనా, రాములో రాములా సాంగ్స్ యూట్యూబ్ షేక్ చేస్తున్నాయి. ఈ మద్య విడుదలైన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో రూపొదించారు.

అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ ఓ రేంజ్ లో పెలింది. స్టైల్ గా ఉంది కదా నాకు కూడా నచ్చింది. అంటూ బన్నీ చేప్పే డైలాగ్ ఆకట్టుకుంది ఇన్ని పాటలతో ప్యాక్ చేశాకా డైలాగ్ లేదనా అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ జనవరి 12న రిలీజ్ చేస్తున్నామని సినిమా యునిట్ చెప్పిన సంగతి తెలిసిందే. గతంలో త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్నమూడో మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతా ఆర్ట్స్ ట్విట్టర్ వేదికగా సాంగ్ ప్రోమో విడుదల కాగా, పూర్తి పాట 24న విడుదల కానుంది. ఇక కొత్త సాంగ్ టీజర్ ను షేర్ చేసిన హీరోయిన్ పూజా హెగ్డే, ఈ పాట చాలా అద్భుతంగా ఉంటుందని ప్రామిస్ చేస్తున్నట్టు తెలిపింది. ఈ సినిమాలో తనకు నచ్చిన పాటను ఎంచుకోమంటే చాలా కష్టమని వ్యాఖ్యానించింది. కాగా, ఈ సినిమా జనవరి 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. బుట్టబొమ్మా బుట్టబొమ్మా… నన్ను సుట్టుకొంటివే అన్న సాంగ్ టీజర్ అదిరిపోయిందంటున్నారు మెగా ఫ్యాన్స్. అల వైకుంఠపురములో సినిమాలో సుశాంత్‌, నివేదా పేతురాజ్స్‌ నవదీవ్‌, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీకి తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. అల్లు అరవింద్, రాథాకృష్ణ సంయుక్తంగా ఈ మూవీనిర్మిస్తున్నారు.

Related posts