వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా… మే నెలలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. సూపర్ స్టార్ రజీని కాంత్ రాజకీయ ఆరంగ్రేటంతో తమిళనాడు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. జనవరిలో రజీనికాంత్ కొత్త పార్టీ పెట్టనున్నారు. ఇది ఇలా ఉండగా.. రజినీ కాంత్ పార్టీతో పొత్తుపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తామిద్దరి వల్ల ప్రజలకు మేలు జరుగుతుందన్న పక్షంలో అహాన్ని పక్కన పెట్టి సహకరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కమల్ హాసన్ తెలిపాడు. తన చిరకాల మిత్రుడు రజినీకాంత్ ప్రారంభించే పార్టీతో పొత్తు పెట్టుకునే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామని.. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా తాను పోటీ చేస్తానని కమల్ హాసన్ పేర్కొన్నాడు. అయితే.. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది ఇంకా ఖరారు కాలేదని… త్వరలోనే దానిపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. తాను ప్రజల కోసం దేనికైనా సిద్ధమని తెలిపాడు కమల్.
previous post

