రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ “కల్కి”. అదా శర్మ, నందితా శ్వేత నాయికలు. పూజితా పొన్నాడ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించగా… స్కార్లెట్ విల్సన్ స్పెషల్ సాంగ్ లో నర్తించింది. శివానీ, శివాత్మిక సమర్పణలో సి. కళ్యాణ్ నిర్మించారు. కె.కె. రాధామోహన్ పంపిణీ హక్కుల్ని సొంతం చేసుకున్నారు. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకొస్తుందీ చిత్రం. 1983 నేపథ్యంలో సాగే కథ ఇది. ఇదొక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. తాజాగా “కల్కి” మూవీ సెన్సార్ పూర్తి అయింది. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక రాజశేఖర్ ఇంతకుముందు నటించిన “గరుడవేగ” చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ చిత్రంపై కూడా భారీగా అంచనాలు పెరిగాయి. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని పూర్తి నమ్మకంతో ఉన్నారు చిత్రబృందం.
next post