కాకినాడ జిల్లాలో మరో ఘోరం చోటు చేసుకుంది. హాస్టల్లో వుండి చదువుకుంటున్న ఓ బాలికపై కన్నేసిన స్కూల్ కరస్పాండెంట్ నీచానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. హాస్టల్ లోనే ఉంటున్న 15 ఏళ్ల మైనర్ బాలికపై అతను చాలా సార్లు అత్యాచారం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళితే..
కాకినాడ పట్టణంలోని కొండయ్యపాలెంలోని హెల్పింగ్ హ్యాండ్స్ ఎయిడెడ్ స్కూల్లో గొడారిగుంట ప్రాంతానికి చెందిన 14ఏళ్ల మైనర్ బాలిక 9వ తరగతి చదువుతోంది. బాలిక ఇళ్లు స్కూల్ కు దూరంగా వుండటంతో స్కూల్ హస్టల్లో ఉంటూ చదివిస్తున్నారు.
కొన్నాళ్ల క్రితమే ఆమె తండ్రి చనిపోయాడు. దీంతో తల్లే ఆమెను చూసుకుంటోంది. ప్రస్తుతం ఆ బాలిక 9వ తరగతి రాసింది. అదే ఆ బాలికపై స్కూల్ కరస్పాండెంట్ కొత్తపల్లి విజయ్ కుమార్ అనే 60 ఏళ్ల వ్యక్తి కన్నేసాడు.
బాలికను చదువుల పేరిట భయపెట్టి లోబర్చుకున్న కరస్పాండెంట్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం భయటపెట్టొద్దని బెదిరించడం భయంతో బాలిక ఎక్కడా నోరువిప్పలేదు. అయితే తాజాగా బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో బాలిక ఇంటివద్ద వుంటోంది. అయితే మూడురోజుల క్రితం ఆమె తీవ్ర కడుపునొప్పి, రక్తస్రావంతో బాధపడుతుండంతో తల్లిదండ్రులు జిజిహెచ్ కు హాస్పిటల్ కు తరలించారు. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలిక గర్భం దాల్చి అబార్షన్ అయినట్లు తెలిపారు.
దీంతో తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో తనపై స్కూల్ కరస్పాండెంట్ జరిపిన అత్యాచారం గురించి బాలిక బయటపెట్టింది.
అయితే, బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆమెకు గర్భస్రావం అయిందని డాక్టర్లు తెలిపారు. అందుకే రక్త స్రావం జరిగిందని వెల్లడించారు.
శనివారం టూ టౌన్ పోలీసులు చిన్నారితో మాట్లాడారు.కరోనా మందులు ఇస్తానంటూ కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చాడని, వాటిని వేసుకున్నాక మత్తుగా అనిపించిందని బాలిక పోలీసులకు వెల్లడించింది.
బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు విజయ్ కుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.