విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి నేడు.. ఎన్టీఆర్ నటన, పోషించిన పాత్రలు ఎప్పటికీ మరువనివి..
ఇక..నందమూరి నట వారసత్వాన్ని పెద్దాయన తరువాత బాలకృష్ణ నిలబెడితే.. బాలకృష్ణతో పాటు ఆతరువాత తరంలో జూనియర్ ఎన్టీఆర్ ఇనుమడింపచేస్తున్నాడు. ఎన్టీఆర్ కు ఎంతో మంది మనవళ్లు ఉన్నా.. ఆయన నటవారస్వానికి స్టార్ హోదాతో వన్నె తెచ్చాడు తారక్.
తాత ఎన్టీఆర్ అంటే జూ. ఎన్టీఆర్ కు ఎనలేని ప్రేమ. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా తాతను స్మరించుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోందని, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోందని, పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా’ అంటూ ఎన్టీఆర్ ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు.