telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అభిమానం ముదిరితే ఇలాగే… హీరో కోసం 1000 మెట్లు మోకాళ్లపై…!

Naga-Chaitanya

సాధారణంగా సెలెబ్రిటీలందరికీ అభిమానులు ఉంటారు. రాజకీయం, సినిమా, క్రీడలు అనే సంబంధం లేకుండా సెలెబ్రిటీలందరికీ డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అయితే కొన్నిసార్లు వారు చూపించే వీరాభిమానం వేరే లెవెల్ లో ఉంటుంది. కొన్నిసార్లు ఇతరులకు అది పిచ్చితనంగా కూడా అనిపించవచ్చు. తాజాగా సాగ‌ర్ అనే వీరాభిమాని చేసిన ప‌ని చూసి షాక‌వ‌డం అంద‌రి ప‌నైంది. ఇంత‌కు ఆ సాగర్‌లాంటి వీరాభిమాని ఉన్నహీరో ఎవ‌రో కాదు అక్కినేని నాగ‌చైత‌న్య‌. నవంబ‌ర్ 23న నాగ‌చైత‌న్య పుట్టిన‌రోజు జ‌రుపుకున్నారు. త‌న అభిమాన హీరో సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటూ సాగ‌ర్ సింహాచ‌ల ఆల‌యంలోని 1000 మెట్లు మోకాళ్ల‌తో ఎక్కాడు. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాన్ని చూసి చైత‌న్య స‌తీమణి, హీరోయిన్ స‌మంత స్పందించింది. త‌న అభిమానానికి మాట‌లు రావ‌డం లేద‌ని, త‌మ‌ని వ‌చ్చి క‌ల‌వాలంటూ ట్వీట్ చేసింది. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి హీరో హీరోయిన్‌గా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Related posts