telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

థాయ్‌లాండ్ : .. తీర్పు చెప్పి .. కాల్చేసుకున్న న్యాయమూర్తి..

Court-Order

కోర్టులో తీర్పు చెప్పిన తర్వాత న్యాయమూర్తి తనను తాను కాల్చుకున్నారు. అంతకు ముందే ఓ కేసులో వాదనలు విన్న సదరు జడ్జి ఆరుగురు ముద్దాయిలను నిర్ధోషులుగా ప్రకటించారు. తీర్పు సమయంలో ఉద్వేగానికి లోనైన జడ్జీ సమాజంలో జరుగుతున్న పరిణామాలపై ఫేస్‌బుక్ లైవ్ ద్వార తెలిపారు. తుపాకితో కాల్చుకున్న జడ్డిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. యాలా కోర్టులో పని చేస్తున్న కనాకోర్న్ పియాంచన అనే జడ్జీ ముద్దాయిలను నిర్థోషులుగా ప్రకటించిన తర్వాత తన జేబులో ఉన్న తుపాకిని తీసీ కాల్చుకున్నారు. అంతకు ముందు ఒకరిని శిక్షించాలంటే అందుకు తగిన అధారాలు పక్కాగా ఉండాలి. ఒకవేళ లేకపోతే వారిని శిక్షించకూడదు అన్నారు ఆ జడ్జి.

న్యాయ ప్రక్రియలో మరింత పారదర్శకత, విశ్వాసం ఉండాలి అంటూ తీర్పుకు ముందు ఫేస్‌బుక్ లైవ్‌లో ఉద్రేకపూరితంగా మాట్లాడారు. దీంతో పాటు థాయ్‌లాండ్ కోర్టులో ధనవంతులకే అనుకూలంగా ఉంటాయని ,సామాన్య ప్రజల విషయంలో కఠినాత్మకంగా ఉంటాయని అనే విమర్శలు వస్తున్నాయని , వీటీని భరించలేకనే జడ్జీ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానిక మీడీయాలో అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఆయనకు వ్యక్తిగత కారణాల ఒత్తిడిలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారనే అభిప్రాయం కూడ వ్యక్తం అవుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జడ్డి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్టు వెల్లడించారు.

Related posts