telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో.. 50శాతం రిజర్వేషన్ .. : ఏపీసీఎం జగన్

AP

ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి తీసుకోనటువంటి సంచలన నిర్ణయాలు తీసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నాడు. తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా ప్రజలకు మంచి జరిగేలా ఆ సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా సీఎం జగన్ చూస్తున్నాడు. ప్రజలు అనే వారు.. మాట ఇస్తే ఎంత తెగించి అయినా సరే ఆ పని చేస్తాడు, మాటను నిలబెట్టుకుంటాడు అని. అది సీఎం జగన్ తండ్రి రాజన్న గురించి ఆ మాట అనేవారు. ఇప్పుడు అచ్చం అలానే తండ్రి బాటలో నడుస్తున్నాడు సీఎం జగన్. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రజలకు మరో శుభవార్తను తెలియజేశాడు సీఎం జగన్. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం అవకాశం కల్పించాలని నిర్ణయించారు.

ప్రభుత్వ నిర్ణయం అమలు కోసం సాధారణ పరిపాలనశాఖ నేతృత్వంలో రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జగన్ సూచించారు. ఈ నిర్ణయానికి సంబంధించి డిసెంబర్ 1న కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేయనున్నారు. ఈ నిర్ణయం వచ్చే కేబినెట్‌ సమావేశంలో ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేడు సీఎం జగన్ ‘వైయస్సార్‌ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం 5.40 కోట్ల మందికి నేత్ర పరీక్షలు చేసి, వారికి అవసరమైన చికిత్సలను అందిస్తారు. కంటి పరీక్షల నుంచి శస్త్రచికిత్సల వరకు అన్ని సేవలనూ ఉచితంగా అందిస్తారు. ఈ కార్యక్రమంతో రాష్ట్రమంతాట కంటి వెలుగు రానుంది.

Related posts