దివంగత నటి జియా ఖాన్ తల్లి రబియా అమిన్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 2015లో నటి జియాఖాన్ అనుమానాస్పదంగా చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ కేసులో నటుడు సూరజ్ పంచోలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును సల్మాన్ తన మనీ పవర్‌తో వీగిపోయేలా చేశాడని జియాఖాన్ తల్లి రబియా అమిన్ తెలిపారు. సల్మాన్ జియా ఖాన్ కేసులో తన మనీపవర్‌ను ఉపయోగించారని, ఓ సీబీఐ ఆఫీసర్ ఈ విషయాన్ని తనకు తెలియజేశారని రబియా అమిన్ చెప్పారు. సల్మాన్ ప్రతిరోజూ కాల్ చేసేవాడని, అంతే కాకుండా సూరల్ పంచోలిని ఇబ్బంది పెట్టొద్దంటూ సల్మాన్ చెప్పాడని సదరు ఆఫీసర్ తనకు చెప్పినట్లు రబియా అమిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
previous post
బిగ్ బాస్-3 : రాహుల్ పై వితిక షాకింగ్ కామెంట్స్…!?