telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

ఝార్ఖండ్ పోలింగ్ లో పోలీసు కాల్పులు

gun fire

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్ లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. గుమ్లా జిల్లాలోని సిసాయి నియోజకవర్గంలోని 36వ నెంబర్ పోలింగ్ బూత్ వద్ద భద్రతా సిబ్బంది నుంచి ఆయుధాలను లాక్కోవడానికి కొంతమంది దుండగులు ప్రయత్నించారు.

దీంతో భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. దీనిపై ఏడీజీపీ మీనా స్పందిస్తూ.. ఆయుధాలను ఎత్తుకెళ్లేందుకు దుండగులు ప్రయత్నించినందుకేభద్రతా సిబ్బంది వారిపై కాల్పులు జరిపారని తెలిపారు. మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.

Related posts