ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ కితాబిచ్చారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబును మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. పలు కేసుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ వైసీపీ అధినేత జగన్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని…ఇదే సమయంలో ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతివ్వాలని కోరారు.
పేపర్ బ్యాలెట్ కోసం తాము చేస్తున్న పోరాటం కొనసాగుతుందని దేవెగౌడ తెలిపారు. మోదీ ప్రభుత్వం దేశంలోని వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తోందని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కూటమి బలంగా ఉందని తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులపై ఐటీ శాఖను ఉసిగొలుపుతున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను ఏక తాటిపైకి తెచ్చిన ఘనత చంద్రబాబుదేనని వ్యాఖ్యానించారు.