telugu navyamedia
రాజకీయ

నటుడు ప్రకాశ్‌ రాజ్‌కు కేసీఆర్ బంప‌ర్ ఆఫ‌ర్‌ ?

సీని న‌టుడు ప్రకాశ్ రాజ్‌కు సీఎం కేసీఆర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది.టీఆర్ ఎస్ త‌రుపున ప్ర‌కాశ్‌రాజ్‌ను రాజ్య‌స‌భ‌కు పంపే ఆలోచ‌న ఉన్న‌ట్లు చెబుతున్నారు.జాతీయ రాజకీయాలపై గులాబీబాస్ కేసీఆర్ కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశం ఉంది.

ఇటీవ‌ల‌ కేసీఆర్ ముంబయి పర్యటనలో నటుడు ప్రకాశ్‌ రాజ్‌ అందరి దృష్టిని ఆకర్షించారు. కేసీఆర్‌ ముంబయిలో హోటల్‌కు వెళ్లినప్పటి నుంచి అక్కడ జరిపిన సమావేశాలు, తిరిగి పయనం అయ్యే వరకూ ప్రకాశ్ రాజ్ వారితోనే ఉన్నారు. ఈ పరిణామం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.

జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించేందుకు పక్కా ప్లాన్​ చేస్తున్న కేసీఆర్​.. అందుకోసం జాతీయ స్థాయిలో యాక్టివ్​ రోల్​ ప్లే చేసేందుకు కొత్త టీంను రెడీ చేస్తున్నట్లు సమాచారం.

సినిమాలతో పాటు.. రాజకీయాల్లోనూ.. యాక్టివ్​గా ఉండే ప్రకాశ్​రాజ్​కు కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తెరాస తరఫున ప్రకాశ్​రాజ్​ను రాజ్యసభకు నామినేట్ చేసే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం.

అంతేకాక ఇప్పటికే ప్రకాశ్ రాజ్‌కు జాతీయ రాజకీయాలపై అవగాహన ఉండడం,  ఆంగ్లం, హిందీ, తెలుగుతో పాటు దక్షిణాది భాషలపై పట్టు ఉన్న దృష్ట్యా ఆయన సేవలను వినియోగించుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

త్వర‌లో తెలంగాణలో 3 రాజ్యస‌భ స్థానాల‌కు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డుతుంది. వాటిలో ఒక స్థానంలో ప్రకాశ్ రాజ్‌కు కేటాయిస్తే, జాతీయ స్థాయిలో కమలం వైఖ‌రిని ఎండ‌గ‌ట్టేందుకు అవ‌కాశం ఉంటుంద‌నే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అందుకే ఆయన సేవలను వినియోగించుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం.  జాతీయ స్థాయి బృందంలో ఆయనకు చోటు కల్పించవచ్చని అంద‌రూ భావిస్తున్నారు.

 

Related posts