ఎన్నికల వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఒక దేశ అత్యుత్తమ పౌర అవార్డు లభించింది. ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్య్రూ ది అపోస్టల్’ అనే రష్యా అత్యున్నత పౌర అవార్డుతో మోదీని గౌరవించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. .మోదీకి ఈ అవార్డును ప్రకటించేందుకు శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలు జారీ చేస్తూ సంతకం చేశారు.
ఇరు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాలను బలపరచడానికి మోదీ చేసిన ప్రయత్నాలకు గుర్తింపుగా ఆ దేశం ఈ అవార్డును ప్రకటించింది. మోదీకి అంతర్జాతీయ అవార్డు రావడం ఈ నెలలో ఇది రెండోసారి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కూడా తమ దేశ అత్యున్నత పౌర అవార్డు ‘ జయేద్ మెడల్’ను మోదీకి ఇచ్చిన సంగతి తెల్సిందే.
ముస్లింలకు బుద్ధి చెప్పాలంటే.. హిందువులు ముస్లిం మహిళలను రేప్ చేయాలి!: సునీతా సింగ్