telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హృతిక్ కు క్షమాపణ చెప్పకపోతే ఆత్మహత్య తప్పదని బెదిరించారు : కంగనా

kangana

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ బాలీవుడ్‌లో నెపోటిజం (బంధుప్రీతి) గురించి గతంలోనే పలుసార్లు విమర్శలు చేసింది. ఇటీవల యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో మరోసారి గళం విప్పింది. అయితే తాజాగా గతంలో తనను జావేద్ అక్తర్ బెదిరించిన విషయాన్ని బయటపెట్టింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ “గతంలో ఒకసారి జావేద్ అక్తర్ నన్ను కలిశారు. రాకేష్ రోషన్, అతని కుటుంబానికి చాలా పలుకుబడి ఉంది. నువ్వు హృతిక్‌కు క్షమాపణ చెప్పకపోతే చాలా ఇబ్బందులు పడతావు. వారు నిన్ను జైల్లో పెడతారు. ఆ తర్వాత నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని నన్ను గట్టిగా బెదిరించారు” అని కంగనా వెల్లడించింది. కాగా సుశాంత్ ఆత్మహత్యకు కారణం బాలీవుడ్ ప్రముఖులేనని, బాలీవుడ్ లో ఉన్న నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని నెటిజన్లు మండిపడుతున్నారు.

Related posts