telugu navyamedia
రాశి ఫలాలు

జ‌న‌వ‌రి 21, శుక్రవారం రాశిఫ‌లాలు

మేషరాశి..

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. అనుకోని దూరప్రయాణాలు చేస్తారు. బంధువుల‌తో త‌గాదాలు ఏర్ప‌డ‌తాయి. తొందరపడి మాట ఇచ్చి లేని పోని సమస్యలు తెచ్చుకోకండి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడిలు అధిక‌మ‌వుతాయి. దైవదర్శనాలు చేస్తారు.

వృషభరాశి..

సన్నిహితులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వాహనం న‌డిపిన‌పుడు జాగ్రత్త వ‌హించ‌డం మంచిది.ని రుద్యోగులకు రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు సత్ఫలితాలనిస్తాయి. వ్యాపారాల‌లో విజ‌యం సాధిస్తారు. ఉద్యోగ‌స్తుల‌కు ఆఫీసుల్లో శ్ర‌మ అధికం అవుతుంది.

మిథునరాశి..

సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఈ రాశి వారు కుటుంబ‌స‌భ్యులు నుంచి శుభవార్త‌లు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి వెళ‌తారు. మహిళలకు ధనలాభం చేకూరుతుంది.

కర్కాటకరాశి..

కుటుంబంలో అసంతృప్తిగా ఉంటుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆర్థికంగా బాగుండ‌దు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో చికాకులు. ఆనారోగ్యసమస్యలు బాధిస్తాయి . ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు క‌లిసిరావు. ఉద్యోగ‌స్తుల‌కు పనిభారం ఎక్కువ‌వుతుంది.

సింహరాశి..

కొత్త వ్యక్తులతో పరిచయాలు మ‌న‌సుకు సంతోషాన్నిస్తాయి. భార్యాభర్తల మధ్య బంధం మరింతగా దృఢంగా మారుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్న‌నాటి మిత్రులను కలుసుకుంటారు. వ‌స్తు, వాహనయోగం ఉంటుంది. స‌మాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఉద్యోగ‌స్తుల‌కు మంచి రోజులు ఆస‌న్న‌మ‌య్యాయి.

కన్యరాశి…

అనుకోని ప్రయాణాలు చేసి ఇబ్బందులు గురైవుతారు. స్త్రీలు కళాత్మక పోటీలలో విజయం సాధిస్తారు. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. వ్యాపారాల అంత‌గా క‌లిసిర‌వావు. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిక‌మ‌వుతాయి. విద్యార్థులకు శ్ర‌మ పెరుగుతుంది. దైవ‌ద‌ర్శ‌నాలు చేస్తారు.

తులరాశి..

కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. అధిక ఖ‌ర్చులు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. అందరిలోనూ గౌరవం ల‌భిస్తుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభ‌సాటిగా ముందుకు వెళ‌తాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు.

వృశ్చికరాశి..

బంధువులతో విందువినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. అనుకున్న‌ పనులు సాధిస్తారు. వస్తు, వాహాన లాభాలు ఉన్నాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగ‌స్తుల‌కు పై అధికారులు నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటారు.

ధనుస్సురాశి…

అనవసర విషయాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తుంది. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కుటుంబసభ్యులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. అనుకోని ఖ‌ర్చులు అధిక‌మ‌వుతాయి. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగ‌స్తుల‌కు ప‌నిభారం అధిక‌మ‌వుతాయి.

మకరరాశి..

గృహంలో ఏదైనా వస్తువు పోయే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి జాగ్రత్త వహించండి. కుటుంబసభ్యులతో వివాదాలు ఏర్ప‌డ‌తాయి. ధననష్టం ఉంటుంది.. ఆరోగ్యసమస్యలు ఎదుర‌వుతాయి. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు అంత‌గా క‌లిసిరావు. కొన్ని ముఖ్య‌మైన‌ పనులలో అవంత‌రాలు ఏర్ప‌డ‌తాయి.

కుంభరాశి..

ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభవర్తమానాలు వింటారు. ధనం ఎక్కువుగా ఖ‌ర్చు అవుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగ‌స్తులు మీ కార్యాల‌యాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. వస్తులాభాలు ఉంటాయి. మీ ఇంట్లో సంతోషాన్ని నింపే శుభవార్తను వింటారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

మీనరాశి..

కుటుంబంలో ఆనందంగా ఉంటారు. స‌మాజంలో పలుకుబ‌డి పెరుగుతుంది. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. విద్యార్ధులు శ్ర‌మ‌తో మంచి విజయం సాధిస్తారు.

Related posts