telugu navyamedia
రాశి ఫలాలు

జ‌న‌వ‌రి 15, శనివారం రాశిఫ‌లాలు..

మేషరాశి..

ఆర్థిక స‌మ‌స్య‌లు మెరుగుప‌డ‌తాయి. దైవ‌, సేవా కార్యక్రమాల కోసం ధనం ఎక్కువ‌గా ఖర్చు చేస్తారు. బంధువుల రాక‌తో ఇల్లు సంద‌డిగా మారుతుంది . ఇంటాబయటా చికాకులు ఏర్ప‌డ‌తాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. అనారోగ్యం వ‌ల‌న ఇబ్బందులు ప‌డ‌తారు. వ్యాపారాలు లాభ‌సాటిగా ముందుకెళ‌తాయి.

వృషభరాశి..

సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభవార్తలు వింటారు. అనుకోని ధనలాభాలు వస్తాయి. సోదరులతో స‌ర‌దాగా గ‌డుపుతారు. నూతన పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. ప్రయాణాలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది

మిథునరాశి..

ఖ‌ర్చులు అధికం అవ‌డంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆక‌స్మిక ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో సమస్యలు త‌లేత్తుతాయి. ఆలయ దర్శనాలు చేస్తారు. వ్యాపారాలు కొంతనిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు ఏర్ప‌డ‌తాయి. ఆరోగ్యం మంద‌గిస్తుంది.

కర్కాటకరాశి..

అనుకోని ధ‌న‌ లాభాలు ఉంటాయి. కుటుంబంలో అంతులేని ఆనందం వెల్లువెత్తుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం ఏర్ప‌డ‌తాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు క‌లిసి వ‌స్తాయి. నిరుద్యోగుల‌కు ఉద్యోగవ‌కాశాలు వ‌స్తాయి.

సింహరాశి..

పెద్దల ఆహార విష‌యంలో జాగ్ర‌గ వ‌హించ‌డం మంచిది. సంఘంలో పరపతి పెరుగుతుంది. నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి స్నేహితుల‌ను కలుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు వ‌స్తాయి. దైవ‌ద‌ర్శ‌నాలు చేస్తారు. విందులు,వినోదాలలో పాల్గొంటారు.

కన్యరాశి..

బందువుల‌తో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. ఆరోగ్యం మంద‌గిస్తుంది. శ్రమ తప్పదు. పనులలో ఆటంకాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. మహిళలకు మాటపట్టింపులు ఎక్కువ‌గా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడిలు పెరుగుతాయి. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. వ్యాపారాలు మంద‌కొడిగా ఉంటుంది.

తులరాశి..

ఆర్థికంగా అంతంత మాత్రమే. కుటుంబ‌స‌భ్యులతో వివాదాలు ఏర్ప‌డ‌తాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు చేస్తారు. ఉద్యోగాలలో పై అధికారులు నుంచి ఒత్తిడులు ఎక్కువ‌వుతాయి. అందరితో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

వృశ్చికరాశి..

అనుకోని శుభ వార్తలు వింటారు. మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. విందువినోదాల్లో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. వ్యాపారాలు మంచి లాభాలు వ‌స్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్య‌లు వ‌స్తాయి .

ధనుస్సురాశి..

మహిళలు కొత్త వ‌స్తువులు కొనుగొలు చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ స‌భ్యుల‌తో స‌ర‌దాగా గడుపుతారు. చేపట్టిన పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు.

మకరరాశి..

అధికారుల సహకారంతో కొన్ని ముఖ్య‌మైన‌ పనులు పూర్తి చేస్తారు. విద్యార్ధులు రాత ప‌రీక్ష‌ల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. బంధువులుతో అకారణంగా విభేదాలు ఏర్ప‌డ‌తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

కుంభరాశి..

ఆర్థిక వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. మహిళలకు మామూలుగా ఉంటుంది. దూరప్రయాణాలు చేస్తారు. ఇంటాబయటా చికాకులు ఏర్ప‌డ‌తాయి. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. సోదరులతో గొడ‌వ‌లు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దైవ‌ద‌ర్శ‌నాలు చేస్తారు.

మీనరాశి..

నిద్యోగులు శుభవార్తలు వింటారు. కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్ధులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు మంచి అవ‌కాశాలు ల‌భిస్తాయి. ఆరోగ్యం స‌హాక‌రించ‌దు.

Related posts