telugu navyamedia
రాశి ఫలాలు

నవంబర్ 15, సోమవారం రాశిఫలాలు..

మేష రాశి..

మీ అభిరుచులకు తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అంతటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.

వృషభ రాశి..

ఒక వ్యవహారంలో ముఖ్యుల నుండి పట్టింపులు, వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. కొత్త వస్తు, నగలు కొనుగోలు చేస్తారు. చేసిన అప్పులు తీరుస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఉద్యోగులకు పదోన్నతులు ల‌భిస్తాయి.

మిధున రాశి..

కొత్త వ్యాపారాలు చేపడతారు.. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగాల్సి ఉంది. ధన నష్టం ఏర్పడుతుంది. కలహాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబ విషయంలో అనుకోని సంఘటనలు ఏర్పడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు.

కర్కాటక రాశి..

క్రీడ, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలకు చోటు ఇవ్వ‌కూడ‌దు.. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగరంగంలోని వారికీ ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

సింహ రాశి..

హోటలు, తినుబండ, క్యాటరింగ్ రంగాల్లో వారికి లాభదాయకంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. ఆల‌యాలు సంద‌ర్శిస్తారు. కుటుంబంలో చికాకులు ఏర్ప‌డ‌తాయి.

కన్య రాశి..

ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు తప్పవు. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మంచి అవకాశాలు జారిపోయి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

తులా రాశి..

గృహంలో ఏదైనా వస్తువులు పోయే ఆస్కారం ఉంది.. బంధు మిత్రుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృశ్చిక రాశి..

సహనంగా ఉండడం మేలు చేస్తుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు వినియోగ విషయంలో పొడుపుని పాటిస్తారు. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు నిరుత్సాహం తప్పదు. ఇంటాబయటా సమస్యలు ఎదుర‌వుతాయి.

ధనుస్సు రాశి..

ఈ రాశికి ఆకస్మిక ధన లాభం పొందుతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. బంధు మిత్రులను కలుస్తారు. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. కంది, మిర్చి, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.

మకర రాశి..

ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణాలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు ల‌భిస్తాయి.

కుంభ రాశి..

మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. బంధువర్గంతో విరోధాలు ఏర్ప‌డ‌తాయి. స్థిరాస్తి విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడతాయి. కలహాలకు దూరంగా ఉండడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు వలన ఇబ్బంది ఏర్పడుతుంది.

మీన రాశి..

ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. చేపట్టిన పనులను ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంది. శుభవార్త వింటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. గౌరవ మర్యాదలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. మిత్రుల నుంచి కీలక సమాచారం.

Related posts