మేషరాశి..
అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనలు స్థిరంగా సాగవు. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యసమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి.
వృషభరాశి..
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం అవుతాయి. శుభవార్తాలు వింటారు. వాహనయోగం లభిస్తుంది. చర్చలు సఫలం అవుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. బ్యాంక్ వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
మిథునరాశి..
కుటుంబంలో చాలాకాలంగా వివాదంగాఉన్న అంశాలు పరిష్కారం అవుతాయి. ఆలోచనలు అంతగా కలసిరావు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆస్తి వివాదాలు ఎక్కువవుతాయి. అనారోగ్యం బారిన పడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు ఏర్పడతాయి. డబ్బు ఆదా చేయలేకపోవడం వల్ల సమయానికి ఆందోళన చెందుతారు.
కర్కాటకరాశి..
కొంత మంది సూటిపోటీ మాటల వల్ల మీరు మానసిక బాధపడతారు. సన్నిహితుల నుంచి సాయం అందుకుంటారు. ధన, వస్తులాభాలు కలుగుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విందువినోదాల్లో పాల్గొంటారు. కొత్త ఉద్యోగవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.
సింహరాశి..
శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు నిరుత్సాహ పరుస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థికంగా అంతగా బాగుండదు. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. ఉద్యోగాలలో పై అధికారులు నుంచి ఒత్తిడులు ఏర్పడతాయి ఫైనాన్స్, వ్యాపారస్తులు జాగ్రత్త వహించండి మంచిది.
కన్యరాశి..
ఎప్పుడు నుంచో పీడిస్తున్న అప్పులు తీరుస్తారు. ఆర్థికంగా మంచి స్థితి కలిగి ఉంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనయోగం కలుగుతుంది. విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. కుటుంబంలో సరదాగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.
తులరాశి..
నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఎవరిక అప్పులు ఇవ్వకండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు.స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి అధికమవుతుంది. విద్యార్థులు పై చదువులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య సూచన కనిపిస్తుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల కలుసుకుంటారు.
వృశ్చికరాశి..
బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబంలో ముఖ్య విషయాలను చర్చిస్తారు. కష్టించినా ఫలితం కనిపించదు. స్వల్ప అనారోగ్యం బారిన పడతాకె. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు ఏర్పడతాయి.ఆధ్యాత్మిక, దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
ధనుస్సురాశి..
దూరపు బంధువుల కలయిక ఏర్పడుతుంది. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అప్పులకు ప్రయత్నాలు చేస్తారు. కుటుంబంలో ఒత్తిడులు ఏర్పడతాయి. స్త్రీలకు టీవీ ఛానెళ్లు, పత్రికా సంస్థల నుంచి పారితోషికం అందుతుంది.
మకరరాశి..
కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడతాయి. విందు వినోదాలు పాల్గొంటారు, శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ధనలాభం సూచనలు కనిపిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి కనిపిస్తుంది.
కుంభరాశి..
సోదరులతో కలహాలు ఏర్పడతాయి. మత సంబంధ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎదురుచూస్తున్న ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వస్తు, భూలాభాలు వస్తాయి. ఇంటాబయటా అనుకూలం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కుముడులు వీడతాయి. కళాకారులు, సినిమా రంగాల్లో వారికి అభిమానులు పెరుగుతారు.
మీనరాశి..
వ్యవహారాలలో ఆటంకాలు. బాధ్యతలు పెరుగుతాయి. మహిళలకు పని బారం పెరుగుతుంది. పక్కవారితో వివాదాలు ఏర్పడతాయి. ఆత్మీయుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. ధనం ఖర్చు అవుతుంది. ఆరోగ్యసమస్యలు సూచనలు కనిపిస్తున్నాయి.