యూరియా కోసం తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాకలో యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడి ఎల్లయ్య అనే రైతు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. యూరియా కోసం రైతు చనిపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని అన్నారు.
ఈ ఘటనపై బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు స్పందించాలని డిమాండ్ చేశారు. రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులను సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ప్రాణాలు కోల్పోయిన రైతు ఎల్లయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.