తాను ధైర్యంతో రాజకీయాలు చేస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ కుట్ర రాజకీయాలకు తాను భయపడనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మోదీ అంటే తనకు భయం లేదని పవన్ వ్యాఖ్యానించారు.
వైసీపీ అధినేత జగన్ లా దొడ్డి దోవలో రానని స్పష్టం చేశారు. కష్టమైనా, నష్టమైనా ధర్మ ద్వారం ద్వారానే వస్తానని తేల్చిచెప్పారు. నేను గుడి మెట్ల దగ్గర ఉండే యాచకుడి లాంటి వాడినని, నా చేతిలో ఎంత వస్తుందో అంతతోనే తృప్తి పడతానని అన్నారు. బీజేపీ నేతలవి అవకాశవాద రాజకీయాలని పవన్ దుయ్యబట్టారు.


ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ దే విజయం: ఉత్తమ్