telugu navyamedia
రాజకీయ వార్తలు

లాక్ డౌన్ గురించి జగన్ కు అమిత్ షా ఫోన్!

amith shah bjp

కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ఈ నెల 31న ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోహోమంత్రి అమిత్‌షా ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు ఫోన్ చేసి లాక్‌డౌన్‌పై అభిప్రాయాలను స్వీకరిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. కరోనా నివారణ చర్యలు, లాక్ డౌన్ పై ఇరువురి మధ్య చర్చ జరిగింది. కరోనా మహమ్మారి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా అమిత్ షాకు జగన్ వివరించారు.

మరోవైపు దేశంలో గురువారం ఉద‌యం నుంచి శుక్ర‌వారం ఉద‌యం వ‌ర‌కు 24 గంట‌ల్లో 7467 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో క‌రోనా కాలుమోపిన త‌ర్వాత ఒకేరోజు ఇన్ని కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. ఈ నేప‌థ్యంలో క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి లాక్ డౌన్ కు కేంద్ర ప్రభుత్వం ముగింపు పలుకుతుందా? మరోసారి పొడగిస్తుందా అనే దాని పై సర్వాత్రా ఉత్కంట నెలకొంది.

Related posts