telugu navyamedia
క్రీడలు వార్తలు

నిన్నటి మ్యాచ్ లో ఈ సీన్ చూసారా..?

ఐపీఎల్ 2021 లో నిన్న జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ విజయానికి చివరి 4 బంతుల్లో 13 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో బెంగళూరు ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ ఓ బీమర్‌ని సంధించాడు. దాంతో అతడిని వెంటనే బౌలింగ్ నుంచి తప్పించాలని డేవిడ్ వార్నర్ డగౌట్ నుంచి డిమాండ్ చేశాడు. అప్పటికే ఒక బీమర్‌ని సందించిన కారణంగా.. వార్నర్ అలా డిమాండ్ చేశాడు. 2017లో మార్చిన క్రికెట్ నిబంధనల ప్రకారం ఒక మ్యాచ్‌లో బౌలర్ రెండు బీమర్లని సంధిస్తే.. అతడ్ని వెంటనే బౌలింగ్ నుంచి తప్పిస్తారు. ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో జేసన్ హోల్డర్‌కి ఓ బీమర్‌ని హర్షల్ పటేల్ సంధించాడు. అయితే ఆ బంతిని ఫీల్డ్ అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. చివరి ఓవర్‌లోనూ రషీద్ ఖాన్‌కి మరోసారి బీమర్‌ని హర్షల్ వేశాడు. ఈ బంతిని కూడా నోబాల్‌గా అంపైర్ ప్రకటించాడు. అయితే రెండు బీమర్లు విసిరిన నేపథ్యంలో.. ఐసీసీ రూల్స్ ప్రకారం డేవిడ్ వార్నర్ స్పందించాడు. హర్షల్‌ను వెంటనే బౌలింగ్ నుంచి తప్పించాలని డగౌట్ నుంచి వెలుపలి వచ్చి వార్నర్ డిమాండ్ చేశాడు. ఈ విషయమై బౌండరీ లైన్‌ వద్ద ఉన్న ఫోర్త్ అంపైర్‌తో అతను మాట్లాడుతూ కనిపించాడు.

Related posts