telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎమ్మెల్యే బాలకృష్ణ పై సంచలన ఆరోపణలు చేసిన జగన్

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖులను అవమానించారంటూ బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ శాసనసభలో చర్చను ప్రారంభించారు.

దానిని కొనసాగిస్తూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జగన్, మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది.

మెగాస్టార్ చిరంజీవిపై ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ఘాటుగా స్పందించారు.

బాలకృష్ణ అసెంబ్లీకి మద్యం సేవించి వచ్చారని, ఆయన మానసిక స్థితి పై సంచలన ఆరోపణలు చేశారు.

“అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి? ఆయన మాట్లాడింది ఏంటి? అదంతా పనికిమాలిన సంభాషణ. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు.

తాగి వచ్చిన వ్యక్తిని సభలోకి ఎలా అనుమతిస్తారు? అలా మాట్లాడేందుకు అనుమతించిన స్పీకర్‌కు బుద్ధి లేదు” అని జగన్ తీవ్రంగా విమర్శించారు.

అంతటితో ఆగకుండా, “బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో ఆ మాటలతోనే అర్థమవుతోంది. తన సైకలాజికల్ ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలి” అని వ్యాఖ్యానించారు.

Related posts