telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్‌ మెట్రో లో గుండె తరలింపు…

5.5 km metro corridor in patabasti

హైదరాబాద్‌ మెట్రో లో గ్రీన్ ఛానల్ ద్వారా గుండె తరలించారు. నగరంలో విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్‌ నేపథ్యంలో గుండె తరలింపునకు వైద్యులు హైదరాబాద్‌ మెట్రోను ఎంచుకున్నారు. మొదటిసారిగా మెట్రోతో గ్రీన్‌ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్సకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. నాగోల్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు నాన్‌స్టాప్ గా మెట్రో గుండె ను తీసుకురానుంది. ఎల్బీనగర్‌ కామినేని నుంచి జూబ్లీహిల్స్‌ అపోలోకు గుండెను ఎలాంటి ఆటంకాలు లేకుండా తరలించేందుకు ఏర్పాట్లు చేసారు. నాగోల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకూ మెట్రో సర్వీస్‌ను నాన్‌స్టాప్ ‌గా నడపనున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి అపోలో ఆసుపత్రి వరకు కూడా రోడ్డుపై గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తరలించనున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల రైతు బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో అతడి గుండెను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకు వచ్చారు. కామినేని ఆస్పత్రి నుంచి నాగోల్‌ వరకు అంబులెన్స్‌లో ఆ తర్వాత నాగోల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకూ మెట్రో సర్వీసులో నాన్‌స్టాప్‌గా మెట్రోలో.. ఇక, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి అపోలో ఆసుపత్రి వరకు కూడా రోడ్డుపై గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తరలించారు. మధ్యాహ్నం 3.30 గంట ప్రాంతంలో గుండెతో బయలుదేరిన వైద్యులు.. మొత్తం 21 కిలోమీటర్లు… 16 స్టేషన్స్ ను దాటుకుని కేవలం 30 నిమిషాలలోపే జూబ్లీహిల్స్ చేరింది. అన్ని స్టేషన్స్ లోనూ పీఏ సిస్టమ్ ద్వారా ఈ ప్రత్యేక రైలు గురించి సమాచారం అందించారు. జూబ్లీహిల్స్ స్టేషన్ వద్ద ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేసి గుండె ను హాస్పిటల్ కు తరలించారు.

Related posts