తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సష్టించిన ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసు విచారణను సిట్ ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన ఐటీ గ్రిడ్ సీఈవో అశోక్‌కు మరోసారి నోటీసులు అందించేందుకు సిద్దమయ్యారు. ఈనెల 11న నోటీసులు జారీ చేసినప్పటికి విచారణకు హాజరు కాలేదు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా అశోక్ విచారణకు హాజరుకాకపోవడం పట్ల సిట్ అధికారులు సీరియస్‌గా ఉన్నారు. 41సీఆర్సీసీ కింద అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఇప్పటి వరకు జరిగిన విచారణను కోర్టుకు పూర్తి స్థాయిలో నివేదిక రూపంలో అందించనున్నారు. ఈ నెల 20న హైకోర్టుకు ఈ కేసుపై నివేదిక ఇవ్వనున్నామని అధికారులు పేర్కొన్నారు.
previous post
next post


బీసీలకు జగన్ ప్రభుత్వం ద్రోహం: యనమల