పరోక్ష పన్నుల వసూళ్లలో జీఎస్టీ కీలక పాత్ర పోషిస్తుందని ఏపీ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నారాయణ స్వామి అన్నారు. శనివారం సాయంత్రం తిరుపతిలో నేషనల్ ట్యాక్స్ కాన్ఫరెన్స్‌లో వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీలో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయని తెలిపారు.
జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తమ వాణిని బలంగా వినిపిస్తోందన్నారు. చిన్న సన్నకారు వ్యాపారులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, తద్వారా వారికి బ్యాంకు లోన్లు సులభంగా అందే అవకాశం ఉందని మంత్రి నారాయణ స్వామి చెప్పుకొచ్చారు. ఆడిటర్ల సమస్యలను సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి పేర్కొన్నారు.
రజినీకాంత్ రాజకీయ ఎంట్రీపై భారతీరాజా కామెంట్స్