telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

‘ఐటీ గ్రిడ్’ ఉద్యోగులు కనిపించడం లేదని హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్ కేంద్రంగా టీడీపీకి సేవలు అందిస్తున్న ఐటీ కంపెనీలో తెలంగాణ పోలీసులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలోగల ఐటీ గ్రిడ్ కంపెనీలో నలుగురు ఉద్యోగులు కనిపించడం లేదని హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలైంది. ఉద్యోగులు రేగొండ భాస్కర్‌, ఫణి కడలూరి, చంద్రశేఖర్‌, విక్రమ్‌గౌడ్‌ కనిపించడం లేదంటూ ఐటీ గ్రిడ్‌ కంపెనీ ఉద్యోగి అశోక్‌ పిటిషన్‌ వేశారు. టీడీపీకి సేవలు అందిస్తున్న ఐటీ కంపెనీలో తెలంగాణ పోలీసులు నిన్న సాయంత్రం సోదాలు నిర్వహించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య డేటా యుద్ధం మొదలైంది.  వివాదం రాజుకుని హైకోర్టులో పిటీషన్ వరకు వెళ్లింది.  

Related posts