telugu navyamedia
ఆరోగ్యం

బ్రౌన్ బ్రెడ్ మంచిదా? వైట్ బ్రెడ్ మంచిదా?

ఆధునిక జీవనశైలిలో తీసుకునే ఆహారం కూడా ఒక ఫ్యాషనైపోయింది. డైట్ చేయాలి.. సన్నబడాలనే ఉద్దేశంతో కొందరైతే అసలు దేవుడి ప్రసాదం తిన్నట్లుగా తింటుంటారు.

మరికొందరు బ్రెడ్ తీసుకోవడాన్ని ఇష్టపడతారు. దాదాపుగా ఉదయం టిఫిన్ కింద బ్రెడ్ తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. శాండ్ విచ్, పాన్ కేక్.. ఇలా రకరకాలుగా బ్రెడ్ ను తీసుకుంటున్నారు.

బ్రౌన్ బ్రెడ్ మంచిదా? లేదంటే వైట్ బ్రెడ్ మంచిదా? అనే విషయంలో ఎక్కువమందికి సందేహం వస్తుంటుంది. ఈ రెండింటిలో ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెడ్ అనేది ఎవరైనా, ఎప్పుడైనా తినొచ్చు. శాండ్ విచ్, టోస్ట్, ఆహారంతోపాటు సైడ్ డిష్ గా తీసుకుంటుంటారు, అయితే ఇలా తీసుకోవడం మంచిదికాదు.దీనిలో మైదాపిండి ఎక్కువగా కలుస్తుంది.

దీనివల్ల శరీరంలో పిండి పదార్థం, ఉప్పుు పెరిగి అధిక రక్తపోటు, గుండె సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వైట్ బ్రెడ్..

వైట్ బ్రెడ్ మంచిది కాదు . ఇందులో పోషకాలు, విటమిన్లు, మినరల్స్ ఉండవు. దీన్ని తీసుకోవడంవల్ల ఎలాంటి ప్రయోజనాలు అందవు. అసిడిటీతోపాటు మలబద్ధకం సమస్యలు వస్తాయి.

బ్రౌన్ బ్రెడ్..

బ్రౌన్ బ్రెడ్ లో విటమిన్ బి, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి విటమిన్లు ఉంటాయి.

జీవక్రియ, శక్తి ఉత్పత్తి, రోగ నిరోధక వ్యవస్థ ఆరోగ్యంతో సహా శారీరక విధుల్లో ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి. బ్రౌన్ బ్రెడ్ లో గోధుమలు, ఉప్పుు, పంచదార, ఈస్ట్, నీళ్లు ఉపయోగించి తయారుచేస్తారు.

ఇందులో 28 గ్రాముల ధాన్యపు పోషకాలు అందుతాయి. గుండె సమస్యల నుంచి తగ్గించడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గాలనుకునేవారు రోజుకు రెండు బ్రౌన్ బ్రెడ్ పీస్ లు తినడంవల్ల సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదలవుతుంది.

Related posts